Tuesday, December 10, 2024

రేపు లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం?

- Advertisement -
- Advertisement -

కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాకు వయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఎన్నికల సర్టిఫికెట్‌ను అందచేశారు. ప్రియాంక గాంధీ గురువారం లోక్‌సభలో ప్రమాణం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కాగా..ఎన్నికల సర్టిఫికెట్‌ను అందుకున్న ప్రియాంక గాంధీని ఆమె సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్లు తినిపించి అభినందనలు తెలియచేశారు.

తనకు సంపూర్ణ మద్దతు తెలిపి తన పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన వయనాడ్ ప్రజలకు ఈ సందర్భంగా ప్రియాంక కృతజ్ఞతలు తెలియచేశారు. ఎన్నికల ప్రచారంలో తన కోసం అవిశ్రాంతంగా పనిచేసి, తన గెలుపు కోసం కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆమె ప్రశంసించారు. ఇదే సందర్భంగా ఆమె వయనాడ్‌లో తన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రియాంక అక్కడి నాయకులతో చర్చించారు. వయనాడ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సమష్టిగా పనిచేద్దామని ఆమె కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News