Thursday, May 2, 2024

సున్నితమైన కథతో తీసిన సినిమా..

- Advertisement -
- Advertisement -

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బన్నీ వాస్ మీడియాతో మాట్లాడుతూ.. “ఒక అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగే ఓ సున్నితమైన కథతో తీసిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పెళ్లి చేసుకోబోయేవాళ్లకు, ఇప్పటికే చేసుకున్నవాళ్లకు ఈ సినిమా చూశాక ఒక క్లారిటీ వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి అవసరమైన అర్హతలు ఏమిటి? పెళ్లి చేసుకున్నాక ఉండాల్సిన అర్హతలు ఏమిటి? అనేది ఈ సినిమా చెబుతుంది. పెళ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలి? లేదా భర్తతో ఎలా ఉండాలి? చెప్పే తల్లితండ్రులు చాలా తక్కువమంది. మేము ఆ పాయింట్‌ను టచ్ చేశాం. ‘పెళ్లికి ముందు మాత్రమే కాదు, పెళ్లి తర్వాత ఎలా ఉండాలనేది పిల్లలకు నేర్పించండి’ అనేది కథలో మెయిన్ పాయింట్. ఇక అల్లు అర్జున్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. ‘పుష్ప’ రిలీజ్ తర్వాత ఆ సినిమాపై క్లారిటీ వస్తుంది”అని అన్నారు.

Producer Bunny Vasu about Most Eligible Bachelor 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News