Friday, September 19, 2025

కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం : కడియం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు తనని నమ్మి ఎమ్ఎల్ఎ గా గెలిపించారని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్ఎల్ఎగా గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించానని, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ను కోరానని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని పలు చోట్లకు గోదావరి జలాలు తీసుకొచ్చామని, కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందించామని అన్నారు. రేవంత్ రెడ్డి సహకారం వల్లే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్టేషన్ ఘన్ పూర్ ప్రజలతోనే ఉంటానని.. ప్రజల కోసమే పనిచేస్తానని హామి ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, చేర్చుకున్న వారిలో ఇద్దరిని మంత్రులు కూడా చేశారని విమర్శించారు. అప్పుడు బిఆర్ఎస్ లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదని, సభాపతి నోటీసు ఇచ్చారని.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

Also Read : మా తెలంగాణ ట్రంప్ ను కూడా పక్కన పడేశారు : రేవంత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News