- Advertisement -
ఉండవల్లి: జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెళ్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. మస్తాన్ అనే వ్యక్తి భార్యతో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మస్తాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్
- Advertisement -