Tuesday, April 30, 2024

ఇక స్వర్ణదేవాలయం నుంచి గుర్బానీ ఉచిత ప్రసారం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఈమేరకు బ్రిటిష్ కాలం నాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు మంగళవారం శాసన సభ ఆమోదించింది. సోమవారం పంజాబ్ క్యాబినెట్ బ్రిటిష్ కాలం నాటి సిక్కు గురుద్వారా చట్టం 1925 కు చేసిన సవరణ ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేసింది. అమృత్‌సర్ స్వర్ణాలయం నుంచి ఉచితంగా అందరికీ ప్రసారం చేయడానికే ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం గుర్బానీని శిరోమణి అకాలీదళ్ కు చెందిన బాదల్ కుటుంబం ప్రైవేట్ ఛానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది.

అయితే ఆప్ నేతృత్వం లోని పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను శిరోమణి అకాలీదళ్ ప్రబంధక్ కమిటీ వ్యతిరేకించింది. 1925 నాటి చట్టం పార్లమెంట్ చేసిందని, దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్రప్రభుత్వానికి ఉండబోదని, పార్లమెంట్ మాత్రమే సవరించాలని వాదించింది. అయితే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ చట్ట పరిధిపై వివరిస్తూ ఇది రాష్ట్ర పరిధిలోనిదని హర్యానా కు సంబంధించిన ప్రత్యేక గురుద్వారా కమిటీకి సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చినట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News