Thursday, May 2, 2024

హర్యానా శివార్లలో ఆగిన రైతు గుండె..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చూపట్టిన ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. దేశ రాజధానిలో నిరసన తెలిపేందుకు పంజాబ్ నుంచి బయల్దేరిన రైతులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హర్యానాలోని అంబాలా సమీపంలో శంభూ సరిహద్దుల వద్ద నిరసన చేస్తున్న ఒక రైతు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన జ్ఞాన్ సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుకు గురై కన్నుమూశాడు. శుక్రవారం ఉదయం ఛాతీనొప్పితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్‌ను సహచర రైతులు సమీపంలోని ప్రభ్వుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తలరించగా అప్పటికే ఆ రైతు మరణించినట్లు డాక్టరు ధ్రువీకరించారు. రైతులు ఏ ఏడాది చేపట్టిన ఆందోళనలో ఇదే తొలి మరణంగా రైతులు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీకి బయల్దేరిన వేలాది మంది రైతులు శంభు, ఖనౌరి సరిహద్దుల వద్ద నిరసన తెలియచేస్తున్నారు. రైతులు ఛలో ఢిల్లీ యాత్ర గత మంగళవారం ప్రారంభమైంది. గురువారం రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులకు, ప్రభ్తువానికి మధ్య జరిగిన అసంపూర్ణంగా ముగిశాయి. తదుపరి విడత చర్చలు ఆదివారం జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News