Sunday, May 5, 2024

రిక్షా వాలాను రైతుల కోసం పాటుపడుతా

- Advertisement -
- Advertisement -

Punjab govt standing with farmers:Charanjit Singh Channi

పంజాబ్ కొత్త సిఎం చరణ్‌జిత్
వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
ఆప్‌పై పరోక్ష విమర్శలు

చండీగఢ్ : ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యం అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. సోమవారం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన తమ తొట్టతొలి విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతుల విద్యుత్ బకాయిలు, నీటి పన్నులు మాఫీ చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం రైతాంగానికి ఎల్లవేళలా తోడునీడగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమది రైతాంగ అనుకూల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రైతులు చెల్లించాల్సిన అన్ని బకాయిలను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. .పార్టీనే అన్నింటి కన్నా సమున్నతం అని ముఖ్యమంత్రి, కేబినెట్ తరువాతి స్థాయిలోనివే అన్నారు. పార్టీని తాను సుప్రీంగా భావించుకుంటానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల మేరకు తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత కాంగ్రెస్ అధిష్టానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దళిత వ్యక్తి, ఇప్పటివరకూ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న చన్నీని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంచుకుంది.

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో కొత్త ముఖ్యమంత్రిగా చన్నీపై పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. తాను ఓ దశలో రిక్షావాలాగా కూడా ఉన్నానని, శ్రమశక్తి విలువ తెలిసిన వాడినని తెలిపారు. రైతాంగాన్ని ఎవరు కించపర్చినా, వ్యవసాయ రంగానికి ఎవరు విఘాతం కల్పించినా సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా సాగుతున్న రైతుల ఆందోళనను చన్నీ పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని నూతన వ్యవసాయ చట్టాలను రైతులు కోరుకుంటున్న విధంగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాము పూర్తి స్థాయిలో రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతామని తెలిపారు.

ఆమ్ ఆద్మీని నేనే ః సిఎం

తాను సాధారణ సామాన్య పౌరుడిని అని తన లాంటి ఆమ్ ఆద్మీని సిఎంగా ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధినాయకత్వానికి తాను రుణపడి ఉంటానని తెలిపారు. తనకు మించిన ఆమ్ ఆద్మీ మరొకరు లేరని పరోక్షంగా ఆయన ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీపార్టీని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపిలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమ్ ఆద్మీపార్టీ శక్తులు సంతరించుకుంటూ వస్తోంది. తాను రిక్షా లాగానని, తన తండ్రి టెంట్లు వేసేవాడని గుర్తు చేసుకున్నారు. తన లాంటి వ్యక్తిని సిఎం చేసిన రాహుల్ గొప్ప విప్లవాత్మక నేత అని కొనియాడారు.
సిఎంగా చన్నీ ప్రమాణస్వీకారం

ముఖ్య అతిథిగా రాహుల్ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ తొలి దళిత సిఎంగా చన్నీ రికార్డు సృష్టించుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పిసిసి నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు కూడా వచ్చారు. తాను కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తరువాత కలుసుకుని ఆశీస్సులు తీసుకుంటానని ఆ తరువాత చరణ్‌జిత్ విలేకరులకు తెలిపారు. ప్రమాణస్వీకార ఘట్టానికి కెప్టెన్ అమరీందర్ రాలేదు. పంజాబ్‌లోని రూప్‌నగర్‌కు చెందిన చమ్‌కౌర్ సాహిబ్ స్థానానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చరణ్‌జిత్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్‌జిందర్ రంధావా, ఓపి సోనీ కూడా ప్రమాణం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News