Monday, June 17, 2024

మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్ కు పివి సింధు

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రతిష్ఠాత్మకమైన మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో సింధు 13-21, 21-16, 21-12 తేడాతో థాయిలాండ్‌కు చెందిన బుసనాన్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు సింధు అటు బుసనాన్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరులో హోరాహోరీ తప్పలేదు.

తొలి సెట్‌లో బుసనాన్ ఆధిపత్యం చెలాయించింది. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన బుసనాన్ సెట్‌ను దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన సెట్‌లో సింధు పుంజుకుంది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అద్భుత ఆటతో ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు దూకుడుగా ఆడి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News