Thursday, May 2, 2024

ఈసారి చినుకు చివుకే.. ఎల్‌నినో ముంచుకొస్తోంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్ర ఉపరితలం అసాధారణ రీతిలో వెడెక్కే పరిణామాన్ని ఎల్‌నినోగా వ్యవహరిస్తారు. వాతావరణ పరిస్థితులతో తలెత్తే ఎల్‌నినో, లా నినాలు సాధారణంగా దేశంలో వర్షపాతాన్ని నిర్ధేశిస్తాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) లానినా పరిస్థితి వల్ల ఈసారి వర్షాకాలం ఆశాజనకంగా ఉంటుందని విశ్లేషించింది. అయితే ఇప్పుడు పలు కారణాలతో ఈ పరిస్థితి మారుతోందని, క్రమేపి ఎల్‌నినో పరిణామం ఏర్పడి, వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

21వ శతాబ్ధం ముగిసే దశలో తీవ్రస్థాయి కార్బన్ ఉద్గారాల వల్ల తరచూ తీవ్రస్థాయి ఎల్‌నినో, లా నినా పరిస్థితులు ఏర్పడుతాయని , ఈ విధంగా కాలక్రమంలో ప్రతి 20 ఏళ్లకోసారి ఎల్‌నినో, ప్రతి పదేళ్లకు లా నినా పరిస్థితి ఏర్పడుతుందని, దీనితో వర్షాభావం లేదా అత్యధిక వర్షాల పరిస్థితులు అతలాకుతలం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితలంపై తలెత్తే పలు రకాల పరిణామాలతో ఇప్పుడు అక్కడ తటస్థ పరిస్థితి ఏర్పడి ఉంది.

దీనితో పసిఫిక్ సముద్ర జలాల్లో శీతల ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది. క్రమేపి ఇది ఉపరితల వాతావరణం వేడెక్కెందుకు దారితీసి, భారతదేశంలో రుతుపవనాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం అయింది. పసిఫిక్ సముద్రంలో తలెత్తే వాతావరణ పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా స్థానిక సీజన్లపై ప్రభావం చూపుతాయి. ఎల్‌నినో, లా నినా పరిణామాలు సముద్రంపై దాదాపుగా 9 నుంచి 12 నెలల వరకూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇవి ఏండ్ల తరబడి కూడా ఉండవచ్చు. వర్షాలను దెబ్బతీసే ఎల్‌నినో లా నినాతో పోలిస్తే ఎక్కువ సార్లు సంభవిస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎప్రిల్ వరకూ పసిఫిక్ సముద్రంపై నెలకొనే వాతావరణ పరిస్థితి ఇందులోని మార్పులు అత్యంత కీలకమైనవి. నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఒఎఎ) తాజా అంచనాల ప్రకారం ఫిబ్రవరి నుంచి ఎప్రిల్ మధ్యలోనే లా నినా నుంచి ఎల్‌నినోకు ముందటి తటస్థ పరిణామం ఎన్‌సో వైపు మారుతాయి. ఇది చివరికి మే నుంచి జులై మధ్యలో ఎనల్‌నినోకు దారితీస్తుంది, నిర్థిష్టంగా ఈ ఎల్‌నినో ప్రభావ పరిస్థితి దేశంలో రుతుపవపనాల ఆగమన దశలోనే ఉండటంతో వర్షాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. 2021 23 మధ్యలో మూడుసార్లు లా నినా పరిస్థితి ఏర్పడింది. దీని తరువాత ఏర్పడే ఎల్‌నినో పరిస్థితి తీవ్రస్థాయిలో వర్షాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News