Thursday, May 2, 2024

తెలంగాణకు వర్షసూచన

- Advertisement -
- Advertisement -

Rains for the next three days in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతీ దిశగా వంపు తిరుగుతుండటం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News