Sunday, April 28, 2024

తెలంగాణకు తప్పిన తుపాన్ ముప్పు..

- Advertisement -
- Advertisement -

RRains forecast in Telangana for next 2 days

మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తౌక్టే తుపాను ప్రభావం తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలింపింది. తుపాను తెలంగాణ రాష్ట్రం నుండి దూరంగా వెళ్లిపోయినట్టు తెలిపింది. అయితే బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40కి.మి వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశ ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రానికి తుపాను బెడత తప్పిపోవటంతో అన్ని వర్గాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేకించి వ్యవసాయరంగానికి పెద్ద గడం గడిచిపోయింది. రాష్ట్రంలో యాసంగి పంటల సీజన్ ఇంకా ముగియలేదు. చాల జిల్లాల్లో వరిపంట కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మిషన్ల ద్వారా వరికోతల పనులు ఈనెలాఖరుకుగాని పూర్తయ్యేలా లేవంటున్నారు. మరోవైపు గత రెండువారాలకు పైగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు వ్యవసాయరంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆరబెట్టిన ధాన్యం రాసులు అకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. తడిసిన ధాన్యాన్ని తిరిగి అరబెట్టుకునేలోపే మళ్లి ఉరుములు మెరుపులతో వర్షం తడిపేస్తోంది. తడిసిన ధాన్యం మొలకలు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పడు సమావేశాలు, సమీక్షలతో అధికారులను అప్రమత్తం చేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా సహకరించటంలేదు. అడపా దడపా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతోనే సతమతమవుతున్న వ్యవసాయ రంగానికి తుపాను కూడా జతకలిసి ఉంటే కోలుకోలేనివిధంగా నష్టం జరిగివుండేదని అధికారులు చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన భీకర తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం తప్పించుకోవంటంతో వ్యవసాయరంగం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.
గోల్కొండలో 44మి.మి వర్షం:
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం నాడు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. గోల్కొండలో అత్యధికంగా 44మి.మి వర్షం కురిసింది. భద్రాద్ర కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో 40.2మి.మివర్షం కురిసింది. మహేశ్వరంలో 35.2, జైనూర్‌లో 33.2, శేరిలింగంపల్లిలో 21.5, గజ్వేల్‌లో 20.8, మునిపల్లిలో 20.8, సిర్పూర్‌లో 20.4, భువనగిరిలో 16.6, నవాబ్ పేటలో 16.4, సంగారెడ్డిలో 15.6, చేవేళ్లలో 14.4, ముల్కలపల్లిలో 14.2, దుండిగల్‌లో 13.8, బూర్గంపహడ్‌లో 13.4 ,షాద్‌నగర్‌లో 12.6, చిల్కూర్‌లో 12.4,యాదగిరిగుట్టలో 108, మఠంపల్లిలో 10.4, మణుగూరులో 10, మధిరలో 8.6, భద్రాచలంలో 8.2, వికారాబాద్‌లో 8.2, దేవరకొండలో 7.4 వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి.

Rains forecast in Telangana for next 2 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News