- Advertisement -
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. ఈరోజు నుంచి వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Advertisement -