Thursday, May 2, 2024

దూసుకెళ్తున్న ‘రాజా విక్రమార్క’

- Advertisement -
- Advertisement -

Raja Vikramarka movie success meet

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. తమకు ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నిర్మాత ‘88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి.టి థాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ “ఆర్‌ఎక్స్ 100 చిత్రం తర్వాత విడుదలైన సినిమాల్లో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ‘రాజా విక్రమార్క’కు వచ్చింది. ఈ సినిమాను ఎక్కువ ఇష్టపడి చేశా. ఇది నాకు మోస్ట్ స్పెషల్ మూవీ”అని అన్నారు. దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “సినిమా చూసి చాలా మంది బావుందని చెప్పారు. ఫోనులు చేసి, మెసేజ్ లు చేసి ప్రశంసించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , పీసీ మౌళి, జస్విన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News