భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా సమాధానం చెప్పామన్నారు. భారత సైన్యం తన సత్తాను చాటిందని.. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పారు. శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. పౌరుల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రశిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామని ఆయన తెలిపారు. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామన్నారు. అమాయకులను చంపిన వారినే మేం చంపామని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, మంగళవారం అర్థరాత్రి భారత సైన్యం.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే-ఎ-తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి.