మెగాస్టార్ చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనను ఇంత ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్‌కి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. చిరుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌ను రీషేర్ చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చిరు పవన్‌లు కలిసి సినిమా చేయాలని కోరారు.
‘‘మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ జోష్ నింపినట్లు అవుతుంది. ఆ చిత్రం ఈ శతాబ్ధంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది’’ అంటూ ఆర్‌జివి (Ram Gopal Varma) పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక్క పోస్ట్‌తో చిరంజీవి, పవన్ అభిమానులను తనవైపు తిప్పుకున్నారు ఆర్‌జివి. ఒకవేళ నిజంగానే చిరు, పవన్‌లు కలిసి సినిమా చేస్తే.. దానికి దర్శకుడు ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
Also Read : ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా ప్రాణం పోసుకొని..