Saturday, April 27, 2024

‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

'Ramarao On Duty' to release on July 29th

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలావుండగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ టెర్రిఫిక్‌గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్‌గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

‘Ramarao On Duty’ to release on July 29th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News