Friday, May 3, 2024

దగ్గుబాటి హీరోలతో ‘రానా నాయుడు’

- Advertisement -
- Advertisement -

'Rana Naidu' web series with Venkatesh and Rana

 

వెంకీ, – రానా కాంబోలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్, సుప్రన్ ఎస్. వర్మ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తారు. మొట్టమొదటిసారిగా రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి చేయబోయే ఈ క్రైమ్-డ్రామా సిరీస్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో రూపొందే ‘రానా నాయుడు’ సిరీస్ కోసం వెంకటేష్ -, రానాలతో చేసిన లుక్ టెస్ట్ ఇమేజ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో దగ్గుబాటి హీరోలిద్దరూ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. కాకపోతే వెంకీ మిడిల్ ఏజ్డ్ పర్సన్ గెటప్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరికీ ఇది డెబ్యూ వెబ్ సిరీస్ కావడం గమనార్హం. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News