Tuesday, April 30, 2024

సిఎం రేవంత్ రెడ్డిపై రాణిరుద్రమ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని సిఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసా లేదు రైతులను అదోగతి పాలు చేసి, రైతుల జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో రైతులు పంటలకు నీళ్లు లేక, పొట్టదశకు వచ్చిన పంటల గింజలు తాలు అయ్యే పరిస్థితి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోయి పశువులు మేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 50లక్షల ఎకరాల్లో వరి సాగైందని సగం పంటలకు నీటి సరఫరా కావడంలేదని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా కూడా రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

రైతు కూలీలకు రూ.12వేలు లేవు, కౌలు రైతులకు రూ.15వేలు జాడ లేదు, పత్తా లేవని, ఇప్పటివరకు కూడా రైతు కూలీలను గుర్తించలేదు వాళ్లను గుర్తించడానికి కమిటీ కూడా వేయలేదన్నారు.రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల రైతులకు ఇస్తరో కూడా ఎలాంటి ప్రణాళిక లేదని ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. రెండు, మూడు రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కొత్త జీవోలను విడుదల చేయడానికి వీలు లేదన్నారు.

క్వింటాల్ ధాన్యానికి రూ.500బోనస్ ఇస్తామని రైతు భరోసా గ్యారెంటీ కింద చెప్పారు కనీసం ఇప్పటివరకు కూడా జీవో విడుదల చేయలేదని మండిపడ్డారు. నిజంగా రైతులకు బోనస్ ఇవ్వాలని ఉంటే వెంటనే జీవో విడుదల చేయాలని, జీవో విడుదల చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులకు సమయం దొరుకుతలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదన్నారు. వారం రోజులుగా పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News