Tuesday, October 15, 2024

రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: ప్రభుత్వానికి అసదుద్దీన్ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పిన సర్కార్.. కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. రేషన్ కార్డులు పొందాలంటే కొన్ని నిందనలు కూడా పెట్టింది. అయితే.. ఈ నిబంధనలపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని సవరించాలని కోరారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి అసదుద్దీన్ వినతి పత్రం సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News