Saturday, October 5, 2024

గుడిలో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్‌, అదితి.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ దేవాలయంలో విరిద్దరు పెళ్లి చేసుకున్నారు.ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరారు. దీంతో నెటిజన్స్ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థ్‌, అదితిల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సిద్ధార్థ్ కిది మూడో పెళ్లి కాగా.. అదితికి రెండో పెళ్లి. గతకొంత కాలంగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలసిందే. కొన్ని రోజుల క్రితం ఇదే గుడిలో సిద్ధార్థ్, అదితిలు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News