Sunday, April 28, 2024

వరంగల్ ఎంజిఎంలో ‘మూషిక’ వైద్యం

- Advertisement -
- Advertisement -

Rats bite patient in MGM hospital

ఐసియులోని రోగి కాళ్లు, చేతివేళ్లను
కొరికి తినేసిన ఎలుకలు

మంత్రి హరీశ్‌రావు సీరియస్ ఆస్పత్రి
బదిలీ ఇద్దరు కాంట్రాక్టు వైద్యుల సస్పెన్షన్ విచారణ
జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ శ్రీవాత్సవ

కాలు, చేతుల వేళ్లు కొరకడంతో తీవ్ర రక్తస్రావం
ఘటనపై మంత్రి హరీశ్‌రావు సీరియస్
ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యుల సస్పెన్షన్
సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు

మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం : వరంగల్ ఎంజిఎ ం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసియులో రోగి కాళ్లు, చేతి వేళ్లను ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులను సస్పెన్షన్ చేయడంతోపాటు సూపరింటెండ్‌పై బదిలీ వేటు పడింది. మంత్రి హరీష్ ఆదేశాలతో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ నాలుగు రోజుల నుంచి ఊపిరితిత్తులు, శ్వాస, కిడ్నీ సంబంధిత సమస్యతో ఎంజిఎం ఆర్‌ఐసియు వార్డులో చికిత్స పొందుతున్నారు.

బుధవారం రాత్రి అపస్మారక స్థితిలోఉన్న రోగి శ్రీనివాస్ కుడి చేయి వేళ్లకు ఎలుకలు గాయం చేయగా కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో రక్తస్రావం కాకుండా కట్టు కట్టారు. కాగా, సిబ్బంది నిర్లక్షంతో గురువారం ఉదయానికి ఎడమ చేయి వేళ్లతోపాటు కాలు వేళ్లను ఎలుకలు కొరికేయడంతో శ్రీనివాస్‌కు తీ వ్ర రక్తస్రావమైంది. దీనిపై కుటుంబ సభ్యు లు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసియులో రోగికి ఇలా జరిగినా సిబ్బంది పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంజిఎంలో ఘటనపై మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశించారు. దాంతో అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ వార్డును పరిశీలించి, జరిగినదానిపై ఆయన మంత్రికి నివేదిక సమర్పించారు.

విచారణ జరిపి కఠిన చర్య తీసుకుంటాం

ఆస్పత్రి శానిటేషన్ ఏజెన్సీపై ప్రత్యేక కమిటీ నేతృత్వంలో విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులకు గతంలో శానిటేషన్ తీరుపై రెండుసార్లు నోటీసులు ఇచ్చామని కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News