Tuesday, April 30, 2024

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే : తలసాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ :ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఆయన స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఎన్నికలకైనా కెసిఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. రేపే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా తాము రెడీగా ఉన్నట్టుగా చెప్పారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నినాదం ఇప్పటిది కాదన్నారు. దేశంలో మోడీ క్రేజ్ పడిపోయిందని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఓటమి తప్పదనే నివేదికలు బిజెపికి అందాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి పెడితే లాభం జరుగుతుందనే ఆలోచనలో బిజెపికి ఉందన్నారు. జమిలీ ఎన్నికలు అంటే అన్ని ప్రభుత్వాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లు కోసమేనేమో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. దేశంలో ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తామని 2014లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గతంలో కూడ పలుమార్లు దేశంలో ఒకే సారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తావించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News