Tuesday, April 30, 2024

బిజెపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్‌లో : మెట్రోమ్యాన్ శ్రీధరన్

- Advertisement -
- Advertisement -

Ready for Kerala chief ministership if BJP wins:Sreedharan

 

న్యూఢిల్లీ: కేరళలో బిజెపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి తాను పోటీలో ఉంటానని మెట్రోమ్యాన్ ఇ.శ్రీధరన్ (88) స్పష్టం చేశారు. తనకు గవర్నర్ పదవి పట్ల ఆసక్తి లేదని ఆయన అన్నారు. రాజ్యాంగపరమైన గవర్నర్ పదవిలో అధికారాలేమీ ఉండవని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కేరళను అప్పుల ఊబీ నుంచి బయటపడేసి, మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తామని శ్రీధరన్ అన్నారు. తాను బిజెపిలో చేరనున్నట్టు శ్రీధరన్ ఇప్పటికే వెల్లడించారు. ఈ నెల 21న కేరళలో విజయయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా శ్రీధరన్ తమ పార్టీలో చేరుతారని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News