Saturday, April 27, 2024

హైదరాబాద్ రియల్ ఎస్టేట్: డిమాండ్-సప్లయ్‌కి పొంతనలేదు!

- Advertisement -
- Advertisement -
కానీ పెరుగుతూనే ఉన్న రేట్లు!!

హైదరాబాద్:  నగరంలోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే డిమాండ్, సప్లయ్‌కి పొంతనలేకుండా ఉంది. ఈ విషయాన్ని మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ రిపోర్టు(జనవరి-మార్చి 2023) తెలిపింది. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ డిమాండ్ త్రైమాసికం లెక్కన 6 శాతం పెరగ్గా, సప్లయ్ మాత్రం 14.2 శాతం తగ్గింది. తత్ఫలితంగా ప్రాపర్టీ రేట్లు త్రైమాసికం లెక్కన 5.8 శాతం పెరిగింది. హైదరాబాద్‌లోని గచిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ డిమాండ్ విపరీతంగా ఉంది. ఆ ప్రాంతాలు ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా ఉండడం వల్ల ఈ డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. నగరంలోని డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 90 శాతం డిమాండ్ ఈ ప్రాంతాల్లోనే ఉంది. మ్యాజిక్ బ్రిక్ నివేదిక ప్రకారం నగరంలోని మెహదీపట్నం(4.27 శాతం), పోలీస్ కాలనీకొండాపూర్ (3.96 శాతం), బలానగర్ (3.75 శాతం)లో ధరలు పెరుగగా, బంజారా హిల్స్ (-3.94 శాతం) బోడుప్పల్ (-3.77 శాతం), నానక్‌రామ్ గూడ(-3.39 శాతం) మేరకు ధరలు తగ్గాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే పేద తరగతి వర్గానికి, మధ్య తరగతి వర్గానికి స్వంత ఇల్లు అనేదో జీవిత స్వప్నంగానే ఉండిపోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News