Saturday, April 27, 2024

కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఉప్పొంగుతుంది. వరద ప్రవాహం ప్ర‌మాద‌స్థాయికి చేరడంతో ప్రాజెక్టు 14 గేట్లు తెరిచారు. దీంతో ప్రస్తుతం జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు వద్దే ఉండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 702 అడుగులుగా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News