Sunday, April 28, 2024

భారత్ బందీల విడుదల

- Advertisement -
- Advertisement -

ఖతర్‌లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి

2023 డిసెంబర్‌లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం

భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు

ప్రధాని మోడీ, ఖతర్ అమీర్ చర్చల తరువాత విడుదల

న్యూఢిల్లీ : గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అరెస్టయి జైలుపాలైన భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ సిబ్బందిని ఖతార్ విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ హర్షం వ్యక్తం చేసి ంది. ఖతార్‌లోని దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిలో ఏడుగురు భారత్‌కు తిరిగివచ్చారని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రిత్వశాఖ తెలిపింది. వీరి విడుదలకు సహకరించిన ఖతార్ దేశ అమిర్‌కు భారత ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. దహ్రా గ్లోబల్ కేసులో అరెస్టు చేసిన 8 మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి ఖతారీ కోర్టు గత ఏడాది డిసెంబర్‌లో మరణశిక్ష విధించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును మన్నించి మరణ శిక్షను కారాగార శిక్షగా కోర్టు సవరించింది.

దుబాయ్‌లో జరిగిన కాప్28 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఖతార్ అమిర్ షేక్ తమీమ్ మిన్ హమ్మద్ అల్ థానీతో భేటీ జరిపిన కొద్ది వారాలకే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవం గమనార్హం. ఖతార్‌లో అరెస్టయిన 8 మంది భారత మాజీ నౌకాదళ సిబ్బందిలో కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్ల, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండ్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీ వ్ గుప్తా, సైలర్ రాగేష్ ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున వీరిలో ఏడుగురు న్యూఢిల్లీక తిరిగివచ్చారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించిన వీరంతా ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం వల్లనే తాము విడుదల కాగలిగామని తెలిపారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని ఖతార్ అమిర్‌తో చర్చలు జరపడం వల్లనే తాము ఇక్కడకు రాగలిగామని, భారత ప్రభుత్వం కూడా నిరంతరం గా ప్రయత్నాలు సాగించిందని వారు తెలిపారు. భారత్‌కు తిరిగి రావడం కోసం తాము గత 18 నెలలుగా ఎదురుచూస్తున్నామని, తమ విడుదలకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి తాము ఎంతో రుణపడి ఉన్నామని న్యూఢిల్లీకి తిరిగివచ్చిన బందీలలో ఒకరు తెలిపారు. దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న భారత జాతీయులు 2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యారు. అయితే ఈ వ్యవహారంలోని సున్నితత్వాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం కాని, ఖతారీ అధికారులు కాని భారత జాతీయులపై నమోదైన ఆరోపణలను బహిర్గతం చేయలేదు. 2023 అక్టోబర్ 26న ఖతార్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టన్స్ వీరికి మరణ శిక్షను విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈ కేసులోని అన్ని న్యాపరమైన అవకాశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News