Sunday, April 28, 2024

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రొఫెసర్ టి. మోహన్ సింగ్ (82) సోమవారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. మోహన్ సింగ్ ఉస్మానియా ఆర్ట్ కళాశాలలో పదేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఉస్మానియా యూనివర్సీటి చీఫ్ వార్డెన్ గాను ఆయన సేవలు అందించారు. స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా కూడా ఆయన సేవలు అందించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన మోహన్‌సింగ్ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించిన అంచెలంచెలుగా ఎదుగుతూ కల్వకుర్తి జూనియర్ కళాశాలలో పదేళ్లపాటు లెక్చరర్‌గా పనిచేశారు. పిజీలో గోల్డ్ మెడల్ సాధించారు. తదనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి రెండు దశాబ్దాలుగా ఉస్మానియా యునివర్సిటీలో హిందీ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు.

దీంతో పాటు పిహెచ్‌డి చేసే విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అప్పటి నేషనల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు హిందీ భాష సలహాదారుడిగా, అనువాదకుడిగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని తులసి భవన్‌కు డైరెక్టర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. భక్తి సాహిత్య షోధ్ సంస్థకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మోహన్‌సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు,యూనివర్సీటి వైస్ చాన్స్‌లర్ రవీందర్  హైదరాబాద్ నాగోల్‌లోని ఆయన నివాసంలో భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రతో పాటు ఎన్నో పుస్తకాలు రచించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రజాభిప్రాయం సేకరణలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగగ్ జిల్లాలో సందర్శించిన శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై హిందీలో లిఖితపూర్వకంగా రిపోర్టును అందించారు.

మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికను మోహన్ సింగ్ స్వయంగా రచించి అందించారు. ఎందరో పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వారు ఉన్నత చదువులు చదవడానికి మోహన్ సింగ్ కృషి చేశారు. హిందీలో తెలంగాణకి పుకార్ అనే పుస్తకాన్ని రచించగా తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యమంత్రి కెసిఆర్ మోహన్ సింగ్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మోహన్ సింగ్ సంకల్య అనే హిందీ జాతీయ పత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. మోహన్ సింగ్ మృతి పట్ల విద్యాభిమానులు, ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులు సంతాపాన్ని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News