Friday, September 19, 2025

మా తెలంగాణ ట్రంప్ ను కూడా పక్కన పడేశారు : రేవంత్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ట్రంప్ టారిఫ్ లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారని, ట్రంప్ ను తెలంగాణ ప్రజలు పక్కన పడేశారని చురకలంటించారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని, ట్రంప్ ఒక రోజు ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు అంటారని, కానీ వెంటనే భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధిస్తారని, భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టం అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Also Read : కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇవి వాహనాలను ప్రోత్సహిస్తున్నాం: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News