Saturday, July 27, 2024

7న తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ వీడింది. సిఎం పదవికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సోమవారం సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అందజేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. దీనికి భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలం చేకూర్చారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సమర్పించారు. దీనిపై అగ్రనేతలు ఇవాళ సుదీర్ఘంగా చర్చించి రేవంత్ ను సీఎంగా ఎంపిక చేశారు. కేబినెట్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News