Saturday, July 27, 2024

కోట్లు మింగిన కోదాడ మిల్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోదాడ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి సిఎంఆర్ కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ప క్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూ ర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులపై జిల్లా అ దనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లత రెండు టీములుగా ఏర్పడి ఆకస్మికంగా తనిఖీ చే పట్టారు. సివిల్ సప్లై రెవిన్యూ, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో భాగంగా కొమరబండలోని నీల సత్యనారాయణ, కొత్తూరు సత్యనారాయణలకు చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో కోట్లల్లో స్కాం జరిగినట్టుగా గుర్తించా రు. శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు గత కొన్నేండ్లుగా సుమారు రూ. 90 కోట్ల విలువ చేస్తే కస్టమ్ మి ల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు.

2022-23
వానాకాలానికి సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, కేవలం 7067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందని 8,067 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 1,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 202 టన్నుల బియ్యం మాత్రమే మిల్లు నుంచి వచ్చిందని, 10,206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023..24 వానాకాలం సీజన్‌కు సంబంధించి, 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 261 టన్నులు మాత్రమే వచ్చిందని, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి, మొత్తం 21,310 టన్నుల బియ్యం ఇవ్వాలని, దీని విలువ రూ. 90 కోట్లు వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిసి దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
దొడ్డిదారిలో సిఎంఆర్ రైస్..
శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకి ప్రభుత్వం కేటాయించిన సుమారు 100 కోట్లు సిఎంఆర్ ధాన్యాన్ని దొడ్డిదారిన అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ దీనికి విరుద్ధంగా మిల్లు యాజమాన్యం కొన్ని సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా దొడ్డి దారిన అమ్ముకొని సిఎంఆర్ లక్షాన్ని బేఖాతరు చేసింది.
పరారీలో మిల్లు యజమాని సత్యనారాయణ..
శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో సిఎంఆర్ రైస్ విషయంలో అవకతవలు జరగడంతో ఉన్నత స్థాయి అధికారులు తనిఖీ నిమిత్తం వస్తున్నారని తెలుసుకొని సత్యనారాయణ ముందుగానే పరారీ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News