Thursday, May 2, 2024

రోహన్ బోపన్న నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

43ఏళ్ల వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు

ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ కైవసం
మెల్‌బోర్న్ : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బరిలోకి దిగిన బోపన్న టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ బోపన్న 76, 75 తేడాతో ఇటలీకి చెందిన అన్ సీడెడ్ సిమోన్ బొలెలిఅండ్రియా వవసోర్రి జంటను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జోడీలు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పలేదు.

తొలి సెట్‌లో రెండు జంటలు హోరాహోరీగా పారాడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. చివరికీ ఇందులో రోహ న్ బోపన్న జోడీ విజ యం సాధించింది. రెండో సెట్‌లో కూడా ఉత్కంఠ పోరు సాగింది. ఇది కూడా టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యా న్ని కాపాడుకోవడంలో సఫలమైన రోహన్ బోపన్న జోడీ సెట్‌తో పా టు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. కాగా, ఈ టైటిల్‌తో రోహన్ బోపన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మూడో ఆటగాడిగా నయా రికార్డు నెలకొల్పాడు. భారత దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతిల తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా బోప న్న నిలిచాడు. అంతేగాక 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వర కు టెన్నిస్ చరిత్రలో ఇంత పెద్ద వయసులో ఏ ఆటగాడు కూడా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News