Wednesday, May 8, 2024

అణు ఒప్పందం పునరుద్ధరించాలి

- Advertisement -
- Advertisement -

Rouhani proposed to Biden to renew Nuclear deal

 

జో బైడెన్‌కు ఇరాన్ అధ్యక్షుడి సూచన

టెహ్రాన్: తమతో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ప్రతిపాదించారు. గతంలో జరిగిన తప్పిదాలకు పరిహారం చెల్లించాలని,అంతర్జాతీయ ఒప్పందాలకు ,నిబంధనలకు కట్టుబడాలని రౌహానీ సూచించినట్టు ఇరాన్ అధికార మీడియా ఇర్నా పేర్కొన్నది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు 2018లో ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. తమ దేశంపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించేందుకు వీలుగా 2015లో అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. ట్రంప్ ప్రకటన అనంతరం ఇరాన్‌పై ఆంక్షల్ని మరోసారి కఠినం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News