Saturday, April 27, 2024

ఆర్‌ఆర్‌ఆర్ 12కి.మీ. పెరిగే అవకాశం

- Advertisement -
- Advertisement -

RRR 12km. Likely to increase

మొదటి భాగంపై అధ్యయనం పూర్తి
కొండలు, గుట్టలు, చెరువులు
అడ్డుతగులుతున్న కారణంగా
దక్షిణభాగం 12కి.మీ. పెరిగే సూచన
అలైన్‌మెంట్‌లో మార్పులు,చేర్పులు
నవంబర్‌లో నోటిఫికేషన్ జారీకి
కేంద్రం సన్నద్ధం

మనతెలంగాణ/ హైదరాబాద్ : 344 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్‌రోడ్డును రెండు (ఉత్తర, దక్షిణ) భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం అధ్యయనం పూర్తయింది. రెండు భాగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని (అలైన్‌మెంట్) నిర్ణయించి కేంద్రానికి పంపింది. ఇందులో ఉత్తర మార్గాన్ని(అలైన్‌మెంట్) ఖరారు చేసేందుకు అధ్యయనం సాగుతుండగా దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ రహదారి నెంబరు కేటాయింపు, నోటిఫికేషన్ జారీకి జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర మంత్రిత్వశాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం కొన్నిచోట్ల అలైన్‌మెంట్‌లో తేడా రావడంతో ఈ రహదారి కొన్ని కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

దక్షిణ భాగం 162 కిలోమీటర్లు

దక్షిణ భాగంలో చౌటుప్పల్-, ఇబ్రహీంపట్నం,- ఆమనగల్-, షాద్‌నగర్-, చేవెళ్ల-, శంకరపల్లి-, కంది-, సంగారెడ్డి వరకు 170 కిలోమీటర్ల మార్గం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా 158 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వాలు భావించినా కొన్ని కారణాల వల్ల దీనిని పొడిగించే అవకాశం ఉన్నట్టుగా స మాచారం. ఈ మార్గానికి సంబంధించిన నివేదికను ఇప్పటికే కన్సల్టెంట్ సంస్థ కేంద్రానికి అందజేసింది. అందిన మూడు రకాల ప్రతిపాదనలను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలించి చిన్నచిన్న సవరణలు చేశారు. నవంబర్ రెండో వారం నాటికి ఒక మార్గాన్ని ఖరారు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ప్రత్యేక బృం దాలను నియమించనుండగా, భూసేకరణకు అయ్యే వ్య యాన్ని కేంద్ర, రాష్ట్రాలు చెరిసగం భరించనున్నాయి.

ఆరు లేన్లతో 344 కిలోమీటర్ల మేర

భూ సేకరణ పనులు మొదలయ్యాక రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కాలువలు, రిజర్వాయర్ల పరిధి నుంచి ఆర్డర్ అలైన్‌మ్మెంట్ వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత సంయుక్తంగా రూ.17 వేల వ్యయంతో హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆరు లేన్లతో 344 కిలోమీటర్ల మేర ఆర్ ఆర్‌ఆర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టగా యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సాగునీటి కాలువలు, రిజర్వాయర్లు అడ్డువస్తున్నట్లు తేలింది. మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, బస్వాపూర్, రంగ నాయజ్ సాగర్ రిజర్వాయర్లు ఆర్‌ఆర్‌ఆర్ అలైన్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రీజనల్ రింగ్‌రోడ్డు కొన్ని కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

నెలపాటు సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో..

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మ్మెంట్‌కు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదా రుల మంత్రిత్వ శాఖ మహారాష్ట్రకు చెందిన కె ఆండ్ జె ప్రాజెక్టు సంస్థను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నెలపాటు ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. గతంలోనే ఈ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆ తరవాత పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో రహదారి అమరికలో మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆ సంస్థ అధ్యయనాన్ని చేపట్టింది. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలు, చెరువులు, నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా రహదారిని వేయాలని కేంద్రం స్పష్టం చేయటంతో ఆయా అంశాలను కూడా పరిగణనలోకి అధికారులు ముందుకెళుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News