Friday, May 3, 2024

జనవరి 7న ‘ఆర్‌ఆర్‌ఆర్’

- Advertisement -
- Advertisement -

‘RRR’ will release on January 7 2022

 

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. గతంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News