Thursday, May 2, 2024

బంగారం.. వస్తున్నాం

- Advertisement -
- Advertisement -

నగల దుకాణాల వద్ద రూ.2వేల నోట్ల సందడి
వ్యాపారులకు వరంగా మారిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం, అధిక ధరలకు విక్రయాలు,
కఠిన నిబంధనలతో అమ్మకాలు అంతంతే, అవ్యవస్థిత రంగంలో అధికంగా అమ్మకాలు
ఢిల్లీ, ముంబయి, సూరత్ సహా పలు కీలక నగరాల్లో కస్టమర్ల రద్దీ

ముంబయి: రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్‌బిఐ శుక్రవారం ప్రకటించిన త ర్వాత ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. దేశ రా జధాని ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబయి, గుజరాత్ వాణిజ్య కేంద్రం సూరత్, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు పెరిగాయి. శనివారంనుంచి ఢిల్లీలోని రిటైల్ జువెల్లరీ దుకాణాలకు కస్టమర్ల రద్దీ కొనసాగుతోంది.

ఎక్కువ డబ్బులు పెట్టి మరీ బంగా రం ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోని సూరత్ మార్కెట్లో షాపులు జోరుగా బంగారాన్ని విక్రయిస్తున్నాయని, ఎక్కువ ధరకు బంగారాన్ని అ మ్ముతున్నాయని ఓ చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. మార్కె ట్ ధరకన్నా 10 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.66,000 వేలకు చేరుకుంది. ప్రస్తుతం దేశీయ మా ర్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రూ.60,200 ఉంది. రూ.2000 నోట్లతో బంగారం, వెండి కొనుగోళ్లకు సంబంధించి బోలెడు మంది షాపుల వాళ్లను వివరాలు అడిగి తెలుసుకొంటున్పారు.

ఫలితంగా శనివారం షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. అయితే కఠినమైన కెవైసి(నో యువర్ కస్టమర్) నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగానే ఉన్నాయి’ అని ఆలిండియా జెమ్స్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్( జిజెసి) చైర్మన్ సత్యం మెహతా పిటిఐకి చెప్పారు. అయితే రూ.2 వేల నోట్లనుమార్చుకోవడానికి ఆర్‌బిఐ నాలుగు నెలలగడువు ఇవ్వడం వల్ల జనంలో పెద్దగా ఆందోళన కనిపించడం లేదని, షాపుల వద్ద కూడా మామూలు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు.

అంతేకాకుండా వస్తు సేవల పన్ను( జిఎస్‌టి)ని అమలు చేయడం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్( బిఐఎస్)ను అమలు చేయడంతో జువెల్లరీ తయారీదారులు కూడా పద్ధతిగా వ్యాపారం కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారని కూడా మెహతా చెప్పారు.‘ సాధారణంగా పెద్ద నోట్లను నగదు రూపంలో చలామణి చేయాల్సి ఉంటుందని అయితే అది ఇప్పుడు దేశీయ జువెల్లరీ పరిశ్రమలో చాలా తక్కువ అయిపోయిందని, కస్టమర్లు ఎక్కువగా డిజిటల్ రూపంలో లావాదేవీలు జరపడానికి ఎక్కువ అలవాటు పడ్డారని ఆయన చెప్పారు. అందువల్ల రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం బంగారం, ఆభరణాల వ్యాపారంపై పెద్దగా ఉండదని కూడా ఆయన చెప్పారు.అయినప్పటికీ చాలామంది రిటైల్ జువెల్లరీ వ్యాపారులు రూ.2000 నోట్లపై బంగారాన్ని విక్రయించారని, అది కూడా ఎక్కువ ధరకు విక్రయించారని సమాచారం.

అయితే ఇలాంటి వ్యవహారం చాలా వరకు అవ్యవస్థిత రంగంలో మాత్రమే జరుగుతుందని, వ్యవస్థీకృత వ్యాపారులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారని పిఎన్‌జి జువెల్లర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ చెప్పారు. కొంతమంది బంగారం కొనుగోళ్లకు సంబంధించి వివరాలు అడిగిన మాట నిజమే కానీ బంగారం కొనుగోళ్లకోసం పెద్దగా రష్ లేదని మరో బంగారు వ్యాపారి చెప్పారు. దేశంలో బంగారు అభరణాల విక్రయదారులు ఇప్పుడు ఆదాయం పన్నుతో పాటుగా మనీ లాండరింగ్ చట్టాలకు సంబంధించిన కెవైసి నిబంధనలను పాటిస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

కాగా, నోట్ల రద్దు సమయంలో జనం బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారని, అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడన్ని నిబంధనలు పాటించాల్సి ఉండడం వల్ల గతంలో మాదిరి జనం బంగారం కొనుగోళ్లు జరపడం లేదు.2016లో వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు జనం వద్ద ఈ నోట్లు బాగా చలామణిలో ఉండేవి. అయితే రూ.2000 నోట్ల విషయంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్‌బిఐ 2018 19 నుంచే ఈ నోట్ల ముద్రణ ఆపేసింది. అందువల్ల పెద్ద్దగా చలామణిలో కూడా కనిపించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News