Sunday, April 28, 2024

భూపాలపల్లి అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి టౌన్: గత ఫిబ్రవరి నెలలో పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, గౌరవ స్థానిక కౌన్సిలర్లు భూపాలపల్లి పట్టణంలో ఇంకను మిగిలి ఉన్నటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేయుట కోసం మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళగా వారు భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి, మిగిలి ఉన్న అభివృద్ధి పనుల పూర్తి కోసం రూ.50కోట్లను ప్రకటించడం జరిగింది.

అందులో భాగంగా ఇప్పటి వరకే రూ.30కోట్ల రూపాయల పనులకు గాను టెండర్లు పూర్తి చేయడం జరిగింది. అట్టి పనులు వారం రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది, ఇవే కాకుండా మిగిలిన రూ.20కోట్ల టియూఎఫ్‌ఐడిసి నిధులకు పరిపాలనపరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా భూపాలపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం రూ.50కోట్ల నిధులు మంజూరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అదేవిధంగా అట్టి నిధులను తీసుకురావడంలో ముందున్నటువంటి భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు దార పూలమ్మ, చల్లా రేణుక, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, నాగుల శిరీష దేవేందర్, జక్కం రవికుమార్, సజ్జనపు స్వామి, ముంజంపల్లి మురళీధర్, ముంజాల రవీందర్, పిల్లలమర్రి శారద నారాయణ, కురిమిల్ల రజిత శ్రీనివాస్, కొక్కుల స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News