Sunday, April 28, 2024

పర్యాటకులకు రష్యా కొత్త వీసా విధానం

- Advertisement -
- Advertisement -

మాస్కో: పర్యాటకుల కోసం రష్యా కొత్త వీసా విధానం ప్రవేశపెట్టింది. భారత్ సహా 19 దేశాలకు చెందిన పర్యాటకులకు ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే తమ దేశంలోని హోటళ్లలో రూమ్ బుక్ చేసుకుంటే వీసా జారీలో ఉదారత చూపనున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన రష్యా హోటళ్లలో రూమ్ బుక్ చేసుకున్నవారికి టూరిస్టు వీసా దాదాపు వచ్చేసినట్లే అని నిపుణులు అంటున్నారు. పర్యాటకరంగానికి ఊతం ఇచ్చేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా,చైనా, ఇండోనేషియా, ఇరాన్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కువైట్, లావోస్, మలేసియా, మెక్సికో, మయన్మార్, ఒమన్, సౌదీ అరేబియా, సెర్బియా, థాయ్‌లాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ దేశాలకు ఈ కొత్త వీసా విధానం వర్తించనున్నది. ఆయా దేశాల పర్యాటకులు రష్యాలోని హోటల్స్‌లో రిజర్వేషన్ చేసుకుంటే ఆరు నెలల వరకు టూరిస్టు వీసాను సునాయాసంగా పొందొచ్చు. రష్యా 11 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. దాంతోపాటు వీసా జారీ ప్రక్రియను సరళతరం చేసింది. వారం రోజుల్లోనే కొత్త వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మరో 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టాలని పుతిన్ సర్కార్ యోచిస్తోంది. త్వరలో ఈ వీసాలు కూడా అమలులోకి వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News