Saturday, May 3, 2025

టీ20ల్లో సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు

- Advertisement -
- Advertisement -

టీ20ల్లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2025లోనూ తన బ్యాటింగ్ తో సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దీంతో టీ20ల్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా డకౌట్ కాకుండా రెండు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ సాయి సుదర్శన్ అరుదైన ఘనతను సాధించాడు. నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సుదర్శన్ ఈ ఫీట్ నెలకొల్పాడు. అంతేకాదు, టీ20ల్లో భారత్ తరుఫున అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన క్రికెటర్ గానూ సాయి రికార్డు నెలకొల్పాడు. కేవలం 54 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించి సాయి సుదర్శన్ తొలి స్థానంలో ఉండగా.. 59 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా సాయి రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్ష్ మొదటి స్థానంలో ఉన్నాడు.

కాగా, నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గుజరాత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్(76), జోస్ బట్లర్(64), సాయి సుదర్శన్(48)లు బ్యాటింగ్‌తో చెలరేగడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ జట్టును గుజరాత్ బౌలర్లు 186/6 పరుగులకే కట్టడి చేశారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) తప్ప మరెవరూ రాణించలేక పోయారు. ట్రావీస్ హెడ్(20), హెన్రిచ్ క్లాసెన్(23), నితీశ్ రెడ్డి(20)లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ట రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఇశాంత్ శర్మ, కోయెట్జి తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ రెండో స్థానానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News