Tuesday, March 21, 2023

పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్న సమంత

- Advertisement -

 

చెన్నై: తమిళనాడులో సినీ నటి సమంత ప్రత్యేక పూజలు చేశారు. దిండిక్కల్ పళని సుబ్రమణ్య స్వామిని సమంత దర్శించుకున్నారు. కొండ కింది నుంచి పైవరకు హారతి వెలిగిస్తూ సమంత పూజలు చేశారు. మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనారోగ్య సమస్యలు నుంచి త్వరగా కోలుకోవాలని సామ్ ప్రార్థనలు చేశారు.

గతంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ అనేది ప్రధానంగా కండరాలపై ప్రభావం చూపించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బాధితులు కండరాల బలహీనత, నొప్పితో బాధపడతారు. ఎక్కువసేపు నిల్చుని ఉన్నా, నడిచినా త్వరగా అలసిపోవడం లేదా కళ్లు తిరిగి పడిపోతారు. మయోసైటిస్ వ్యాధి ఉన్నవారిలో ఇమ్యూనిటీ డిజార్డర్ తలెత్తి టిష్యూలపై నిరోధక శక్తి చూపుతోంది .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles