Monday, May 13, 2024

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో…

- Advertisement -
- Advertisement -

Sampath nandi birthday celebrations

 

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్’. శనివారం సంపత్ నంది పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూళ్లలో 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని ఆగస్ట్ మొదటివారం నుండి షూటింగ్ మొదలు పెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా దిగంగన నటిస్తున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, తరుణ్ అరోరా నటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News