Thursday, May 2, 2024

శీలం అనేది మగవాళ్లకు కూడా ముఖ్యం

- Advertisement -
- Advertisement -

Sampoornesh babu says about Cauliflower movie

 

సంపూర్ణేష్‌బాబు హీరోగా గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శుక్రవారం థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలో హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ “ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్..రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అని పేరుపెట్టారు. క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుందని డైరెక్టర్ అన్నారు. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ దర్శకుడు చెప్పడంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు… ఇలా అన్నీ బాగుంటాయి. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News