Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: పర్యావరణ రక్షణే పెద్ద సవాల్

- Advertisement -
- Advertisement -

మొక్కలు నాటిన సంజయ్‌దత్

Sanjay dutt plant tree in Green india challenge

మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం సంజయ్‌దత్ మొక్కలు నాటారు. హైదరాబాద్ శిల్పారామంలో ఎంపి సంతోష్‌కుమార్‌తో కలిసి సంజయ్‌దత్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని పెంచడం అందరి జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ముంబాయిలోని నిర్వహించనున్నట్లు సంజయ్ దత్ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదని ఆయన చెప్పారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ఉన్న అడవులను కాపాడుకోవడంతో పాటు కొత్తగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన వసరం ఉందని సంజయ్ దత్ చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మొక్కలు నాటిన వారు తీసుకోవాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంస్కృతి విస్తృతంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నాఅభిమానులు,స్నేహితులు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సంజయ్‌దత్ కోరారు. సంతోష్‌కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ తానుగతంలోనే విన్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచేందుకు సంతోష్‌కుమార్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా తనపుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ నటుడు సంజయ్‌దత్ హైదరాబాద్‌కు వచ్చి మొక్కలు నాటడం పట్ల సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి మరో ముగ్గిరికి సవాల్ విసరుతూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందకు తీసుకువెళ్లాలని ఆయన పిలపునిచ్చారు.

మొక్కలు నాటిన దియామీర్జా

దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విస్తృతంగా ముందుకు సాగుతుంది. ప్రముఖ సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ సందేశాల ఇస్తున్నారు. పారిశ్రమికవేత్తలు, ప్రముఖులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ సవాళ్ల్లు విసురున్నారు. సోమవారం సుప్రసిద్ధ హీరోయిన్ దియామీర్జా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ప్రముఖ హీరోయిన్ ఆలియాభట్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ముంబాయిలో మొక్కలు నాటారు. అనంతరం సానియా సైనానెహ్వాల్, లారాదత్త, అనుష్క శర్మలకు దియామీర్జా ్జ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపుతూ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News