Monday, April 29, 2024

తమన్నానే రియల్ హీరో

- Advertisement -
- Advertisement -

Tamanna says about Gurthunda seetha kalam

 

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, దర్శకుడు నాగశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి, ఎం.ఎస్.రెడ్డి, చినబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని మరో షెడ్యూల్ షూట్ చేసుకోవడానికి సెట్స్ మీదకు వెళ్తోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ “రొమాంటిక్ డ్రామాల్లో నేను నటించి చాలా రోజులు అయింది. ‘గుర్తుందా శీతాకాలం’తో మరో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో దర్శకుడు నాగశేఖర్ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను”అని అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “ఈ సినిమాకు నేను హీరో అయినప్పటికీ తమన్నానే రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీని రేంజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది”అని చెప్పారు. దర్శకనిర్మాత నాగశేఖర్ మాట్లాడుతూ “కన్నడలో నేను స్టార్ డైరెక్టర్‌ని అయినప్పటికీ తెలుగులో ఇది నా డెబ్యూ మూవీ. ఇందులో తమన్నా, సత్యదేవ్‌తో సహా అందరు నటులు చక్కగా నటిస్తున్నారు. దర్శకుడిగా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు భావన రవి, ఎం.ఎస్.రెడ్డి, చినబాబు, ఆనంద్ ఆడియో అధినేత శ్యామ్, రచయిత లక్ష్మీభూపాల్, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News