Thursday, May 9, 2024

క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

Ind vs Aus last T20 Today

 

పరువు కోసం ఆస్ట్రేలియా
నేడు చివరి టి20

సిడ్నీ: వరుస విజయాలతో ఇప్పటికే ట్వంటీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండి యా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని తహతహలాడుతోంది. అంతేగాక హ్యాట్రిక్ విజయాలతో రానున్న టెస్టు సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరును సయితం భారత్ అలవోకగా ఛేదించింది. ఇక ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైన జయభేరి మోగించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. రెండో టి20లో భారీ స్కోరు సాధించినా జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది.

ఇదిలావుండగా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండి యా జోరుమీదుంది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలుపే లక్షం గా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమా రు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌లు కిందటి మ్యాచ్‌లో శుభారం భం అందించారు. ఈసారి కూడా మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలనే లక్షంతో ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి కూ డా దూకుడుగా ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా తయారైం ది. ఇక హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్ తదితరులు కూడా బ్యాట్ తో రాణించే సత్తా కలిగిన వారే. ఇలాంటి స్థితిలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాలంటే ఆస్ట్రేలియా బౌలర్లు మరింతగా కష్టపడక తప్పదు.

బౌలింగ్‌లో కూడా

మరోవైపు టీమిండియా బౌలింగ్‌లో కూడా చాలా బలం గా కనిపిస్తోంది. యువ స్పీడ్‌స్టర్ నటరాజన్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండో మ్యాచ్‌లో ప్రత్య ర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో నటరాజన్ సఫలమయ్యాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. సీనియర్ బౌలర్లు బుమ్రా, షమి లేకున్నా నటరాజాన్ అద్భుత బౌలింగ్‌తో ఆ లోటు లేకుండా చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. వాషింగ్టన్, చాహ ల్, శార్దూల్ తదితరులతో బౌలింగ్ పటిష్టంగా మారింది.

గెలుపే లక్ష్యంగా

ఇక ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా కనీసం చివరి మ్యాచ్‌లోనైన పరువు కాపాడు కోవాలని భావిస్తోంది. రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా బౌలిం గ్ వైఫల్యంతో ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాం టి పొరపాట్లకు తావులేకుండా చూడాలనే లక్షంతో కనిపిస్తోంది. డిఆర్సి షార్ట్, మాథ్యూవేడ్, స్మిత్, మాక్స్‌వెల్, హెన్రిక్స్, స్టోయినీస్ తదితరులతో బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్మిత్, మాక్స్‌వెల్ ఈసారి జట్టుకు చాలా కీలకంగా తయారయ్యారు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ నిలబడి నా భారీ స్కోరు సాధించడం కష్టమేమి కాదు. అయితే కింటి మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవ డం ఆందోళన కలిగిస్తోంది. డానిల్ షమ్స్, సీన్ అబాట్, ఆండ్రూ టై తదితరులు రెండో మ్యాచ్‌లో ఏమా త్రం ప్రభావం చూపలేక పోయారు. దీంతో ఆస్ట్రేలియా కు ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో మాత్రం గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News