Saturday, April 27, 2024

మైమరపించే లవ్లీ మెలోడీ

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘మను చరిత్ర’. ఈ చిత్రంలో శివ సరసన మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన టీజర్ శివ కందుకూరిని ఫెరోషియస్ అవతార్‌లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడే పరిచయమే… పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. గోపిసుందర్ ఈ పాటని లవ్లీ అండ్ మెస్మరైజింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలపించేలా వుంది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: మంచి నటన, గ్లామర్‌తో…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News