Saturday, July 26, 2025

హబ్సిగూడలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

- Advertisement -
- Advertisement -

Sankranthi festival celebrations
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హబ్సిగూడలోని సాయి సుఖ విష్టాస్ అపార్ట్‌మెంట్‌లో సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం భోగి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలతో మొదలు పెట్టిన సంబురాలు చిన్నారుల పంతుంగుల తయారి, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలతో పాటు ఆసాంతం ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంప్రదాయాన్ని ప్రతి బించించేలా మహిళలు వేసిన రంగు రంగు ముగ్గులు, ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అపార్ట్‌మెంట్ వాసులు సంక్రాంతి సంబురాల్లో మునిగి తేలారు. సాయి సుఖ విష్టాస్‌వాసులు ప్రతి యేటా ఇదేవిధంగా మరింత సంతోషంంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News