Tuesday, February 7, 2023

‘ది వాక్సిన్ వార్’లో ‘కాంతార’ బ్యూటీ

- Advertisement -

దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ’కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆస్కార్ 2023 కోసం షార్ట్‌లిస్ట్ అయింది. ప్రస్తుతం వివేక్ రంజన్ అగ్నిహోత్రి ’ది వాక్సిన్ వార్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కోవిడ్-, దేశంలోని వాక్సిన్ డ్రిల్స్ నేపధ్యంలో వుండబోతుంది. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు.

ఈ సినిమా చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. భారతదేశం అంతటా చిత్రీకరించిన తర్వాత, ది వాక్సిన్ వార్ చివరి బ్యాటిల్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ ఈ పాన్ ఇండియా చిత్రంలో చేరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో ఆమె చేరారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. 2023 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles