Saturday, April 27, 2024

సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’

- Advertisement -
- Advertisement -

విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ ని రూపొందిస్తున్నారు, ఇది దేశంలో COVID-19, వ్యాక్సిన్ డ్రిల్ల్స్ గురించి కొన్ని అధ్యాయాలను చూపనుంది. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు చిన్న గ్లింప్స్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఇది ల్యాబ్‌లో కోవిడ్-19 కోసం క్లినికల్ ట్రయల్స్ చూపిస్తుంది. పల్లవి జోషి సైంటిస్ట్‌గా కనిపించగా,  గ్లింప్స్ నానా పటేకర్ పాత్రను కూడా పరిచయం చేసింది.

ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తునారు. ఇంతకుముందు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అసోషియేషన్ లో వున్నారు. ‘వ్యాక్సిన్ వార్’ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10+ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News