Sunday, April 28, 2024

ఆసక్తి రేకెత్తించేలా ‘సర్కారు నౌకరి’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ అనే నూతన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. సర్కారు నౌకరి అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News