Thursday, May 2, 2024

మన స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి… లవ్ యూ

- Advertisement -
- Advertisement -

Saya Manjrekar First Look ‌ Release

 

26/11 ముంబయ్ దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయా మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, – ఫస్ట్ గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సయా మంజ్రేకర్ ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ‘అతని పట్ల ఆమెకున్న ప్రేమ.. దేశం పట్ల అతనికున్న ప్రేమలాగే మనోహరమైనది’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో సయా మంజ్రేకర్, అడవి – శేష్ స్కూల్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు.

‘డియర్ సందీప్.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మన స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి.. లవ్ యూ’ అంటూ ఆమె రాసిన లెటర్‌ని చూపించారు. ఈ సందర్భంగా శేష్ ట్వీట్ చేస్తూ.. “లెటర్‌లోప్రతి పదం సింపుల్‌గా అనిపిస్తుంది.. కానీ చాలా విలువైనది. ఆమె అతన్ని స్కూల్ లో కలిసింది.. ఆమె అతనితో ఒక జీవితం కావాలని కలలు కనింది.. ఆమె రాయగలిగే దానికంటే చాలా ఎక్కువ ఫీల్ అయింది” అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఏప్రిల్ 12న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, – మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ‘మేజర్’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో జులై 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News